Saturday, 4 January 2020

కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

కేసీఆర్ వార్నింగ్: ఓడితే మంత్రి పదవులు ఊడతాయి

త్వరలో జరగనున్నమున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో  జరిగిన TRS విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికలపై పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తామన్నారు. పాత, కొత్త నేతలు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు క్యాడర్‌తో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ ఒకసారి అభ్యర్థి ని ఫైనల్ చేసిన తర్వాత ఆ అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని సూచించారు. అవసరమున్న దగ్గర మంత్రులు ప్రచారం చేస్తారన్నారు. మున్సిపోల్స్‌లో టికెట్ల పంపిణీ, ఎన్నికల ప్రచారం, అసంతృప్తుల బుజ్జగింపు, అభ్యర్థుల గెలుపు వరకూ ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు. మరోవైపు బీజేపీతో మనకు పోటీ అనే అపోహ వద్దని, మనకు ఎవరితోనూ పోటీ లేదన్నారు సీఎం కేసీఆర్.